అల్లరి నరేష్ మళ్లీ అదే కావాలంటాడేంటీ.?

ఇటీవల అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘ఉగ్రం’ సినిమా ఓ మోస్తరు టాక్‌తో బాగానే ఆడిందని చెప్పొచ్చు. ఓటీటీలోనూ ఈ సినిమాకి ఒకింత ఆదరణ దక్కింది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ప్లానింగ్‌లో నరేష్ వున్నాడట. ధియేటర్లలో మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడకపోయినా ఈ సినిమాలో నరేష్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయ్.

నరేష్‌లోని కొత్త యాంగిల్‌ని బయటికి తీసుకొచ్చింది ఈ సినిమా. దాంతో, ఈ సారి రాబోయే సీక్వెల్‌ కోసం మరింత పగడ్భంధీగా ప్లాన్ చేస్తున్నాడట అల్లరి నరేష్.

మంచి బలమున్న స్క్రిప్టు కోసం వెతుకుతున్నాడట. అలాగే, థ్రిల్లింగ్ సన్నివేశాలు కూడా ఇంకా బలంగా డిజైన్ చేయాలనుకుంటున్నాడట.

అయితే, ఇది సీక్వెల్ అవుతుందా.? లేదంటే, ‘హిట్’ మాదిరి ప్రాంఛైజీల్లా తెరకెక్కిస్తారా.? అనేది తెలియాల్సి వుంది. ఈ ప్రాజెక్టుపై తెర వెనక పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.