బాక్సాఫీస్ రిపోర్ట్ : “హిట్ 2” వరల్డ్ వైడ్ 2 రోజుల వసూళ్లు..!

ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ చిత్రం “హిట్ 2” కూడా ఒకటి. పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా తెలుగు స్టేట్స్ లో మాత్రం ఈ చిత్రం గట్టి అంచనాలు మధ్యనే వచ్చి మొదట రోజే 12 కోట్లు మేర వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా జస్ట్ తెలుగు వెర్షన్ తో రాబట్టింది.

ఇక బాక్సాఫీస్ దగ్గర రెండో రోజుకి ఈ చిత్రం చేరుకోగా మేకర్స్ అయితే ఇపుడు అధికారికంగా రెండు రోజుల వసూళ్లను అనౌన్స్ చేశారు. మరి ఈ చిత్రం అయితే ఈ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20.1 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక ఇందులో ఓవర్సీస్ మార్కెట్ నుంచే దాదాపు 6 లక్షలకి పైగా డాలర్స్ తో 5 కోట్లు గ్రాస్ అందుకోగా నైజాం లో రెండు రోజుల్లో 9 కోట్ల మేర గ్రాస్ ని రాబట్టింది. అలాగే నైజాం లో అయితే ఈ చిత్రం రెండు రోజుల్లోనే అనుకున్న టార్గెట్ ని అయితే రీచ్ అయ్యిపోవడం విశేషం..

దీనితో అయితే ఈ క్రేజీ థ్రిల్లర్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి పెర్ఫామెన్స్ ని కనబరుస్తుంది. ఇక ఈ సినిమాకి అయితే దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చెయ్యగా హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. అలాగే నాచురల్ స్టార్ నాని ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు.