పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలి అనుకునే సమయంలో హీరో విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ వ్యవహారం తీవ్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు.ఓ ఇంటర్వ్యూ సంయాక్షన్ హీరో అర్జున్ దర్శకత్వంలో ఆయన కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలని భావించారు. ఈ సినిమా ఎంతో ఘనంగాదర్భంగా ఈ విషయంపై తమ్మారెడ్డి మాట్లాడుతూ యంగ్ హీరోల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇక అర్జున్ విశ్వక్ వ్యవహారం పై తమ్మారెడ్డి మాట్లాడుతూ విశ్వక్సేన్ ప్రవర్తించిన తీరు ఎంతోమంది దర్శక నిర్మాతలను అవమానించినట్లేనని ఈయన మండిపడ్డారు. ఒక సినిమాకు కమిట్ అయ్యేముందు ఆ సినిమా గురించి వివరంగా తెలుసుకొని సినిమాకు కమిట్ అవ్వాలి. ఒక్కసారి కమిట్ అయిన తర్వాత పాటలు నచ్చలేదు,రెమ్యూనరేషన్ నచ్చలేదు అంటూ సాకులు చెప్పకూడదని తమ్మారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటివి ఏవైనా ఉంటే సినిమాకు కమిట్ అవ్వకముందే ఉండాలని ఈయన మండిపడ్డారు.
ఇకపోతే ప్రస్తుత కాలంలో హీరోలు పెద్ద ఎత్తున యాటిట్యూడ్ చూపిస్తున్నారని ఈ యాటిట్యూడ్ కారణంగానే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని ఈయన యంగ్ హీరోలకు చురకలు అంటించారు.ముఖ్యంగా హీరోలు కథ విషయంలో జోక్యం చేసుకోవడం మానేయాలి ఇలా కథ విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.ఇప్పటికీ ఎంతో మంది సీనియర్ హీరోలు ఒక్కసారి కథ లాక్ చేసుకున్న తర్వాత దర్శకుడు చెప్పినట్టే చేస్తున్నారు కానీ ఏం హీరోలు అలా కాదని ఈయన మండిపడ్డారు. ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.