బూతు పదంతో విశ్వక్ సేన్ పోస్ట్… ఆ సీనియర్ హీరోని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారా…?

సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్గా రాణించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఇలా తన ప్రతిభతో ఇండస్ట్రీలో హీరో గా గుర్తింపు పొందిన విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ ఇటీవల నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్నాడు. ఇక తాజాగా ఓరి దేవుడా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన విశ్వక్ అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా ఇటీవల విశ్వక్ సేన్ పై సీనియర్ హీరో అర్జున్ సర్జ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

అర్జున్ దర్శకత్వంలో సినిమా చేయటానికి విశ్వక్ అంగీకరించినట్లు గతంలో అధికారిక ప్రకటన విడుదల అయింది. ఇక ఇటీవల విశ్వక్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ గురించి అర్జున్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అతని గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు అంతేకాకుండా విశ్వక్ సేన్ మీద ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించాడు. తాజాగా అర్జున్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన విశ్వక్ సేన్.. తాను కావాలనే ఈ సినిమా నుండి తప్పుకోలేదని, సినిమాలో కొన్ని మార్పులు చేయమని సూచించిన కూడా… అర్జున్ కళ్ళు మూసుకుని సంసారం చేయమన్నట్లుగా ప్రవర్తించాడని విశ్వక్ వెల్లడించాడు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్ట్ లో విశ్వక్ ఒక భుతూ పదాన్ని ఉపయోగించి పోస్ట్ షేర్ చేశాడు. దీంతో అర్జున్ ని ఉద్దేశిస్తూ విశ్వక్ ఈ పోస్ట్ చేశాడని కొందరు కామెంట్లు చేస్తుంటే… మరికొందరు మాత్రం తనను జడ్జ్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్న జనాలను ఉద్దేశించి విశ్వక్ ఇలా పోస్ట్ చేశాడంటూ అతని అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనా విశ్వక్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదం వల్ల విశ్వక్ కి సినిమా అవకాశాలు కూడ తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.