Sudigali Sudheer: సుధీర్ కన్నా విష్ణు ప్రియ అందంగా ఉంది.. మరోసారి సుదీర్ పరువు తీసిన రోజా!

Sudigali Sudheer: బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రతివారం రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతూ విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుందని చెప్పాలి. ఇకపోతే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుడిగాలి సుదీర్ ఒకరు.

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఏకంగా బుల్లితెర మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న సుదీర్ జబర్దస్త్ వేదికపై అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఈ వారం ప్రసారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సుడిగాలి సుదీర్ ఒక మంత్రగాడి వేషధారణలో వచ్చి అందరినీ ఒక్క సారిగా ఆశ్చర్యపరిచారు. అయితే ఇదే స్కిట్ లోనే యాంకర్ విష్ణు ప్రియ కూడా చిన్న రోల్ చేశారు.

YouTube video player

ఇక సుడిగాలి సుదీర్ ఎంట్రీ ఇవ్వగానే రోజా ఒక్కసారిగా సుధీర్ నీకన్నా విష్ణు ప్రియ చాలా బాగుంది అంటూ మరోసారి తన పై పంచ్ లు వేసి సుదీర్ పరువు మొత్తం తీశారు. ఇలా రోజా ఈ కార్యక్రమం ద్వారా స్కిట్ మధ్యలో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ పై రోజా మరోసారి పంచ్ వేసి అందరినీ నవ్వించారు. ఈ స్కిట్ లో భాగంగా ఆటో రాంప్రసాద్ కూడా తనదైన శైలిలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.