పాపం..అక్కడ “ఏజెంట్” డే 2 కన్నా “విరూపాక్ష” 9వ రోజే ఎక్కువ.!

లేటెస్ట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చిన మరో చిత్రం “ఏజెంట్”. దీనికి ముందు వారమే వచ్చిన హిట్ చిత్రం “విరూపాక్ష” తో భారీ హిట్ టాలీవుడ్ దగ్గర రాగా ఇదే ఊపులో ఏజెంట్ కూడా హిట్ అవుతుంది అని చాలా మంది అనుకున్నారు.

కానీ అనూహ్యంగా మొదటి షో తోనే డిజాస్టర్ అయ్యిపోయిన ఈ చిత్రం వసూళ్లు కూడా బాగా డ్రాప్ అయ్యిపోయాయ్. అయితే  ఓ పక్క ఏజెంట్ డీలా పడితే విరూపాక్ష సూపర్ స్ట్రాంగ్ అవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. యూఎస్ మార్కెట్ లో అయితే ఏజెంట్ కి మొదట రోజే పెద్ద ఓపెనింగ్స్ రాకపోగా రెండో రోజుకి కేవలం 15 వేల డాలర్స్ మాత్రమే రాబట్టింది.

అది కూడా 200 కి పైగా లొకేషన్స్ నుంచి కాగా విరూపాక్ష అయితే రన్ అవుతున్న 9వ రోజు అది కూడా కేవలం 133 లొకేషన్స్ నుంచే సుమారు 17 వేల డాలర్స్ కి పైగా రాబట్టింది. దీని బట్టి విరూపాక్ష చిత్రం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అలాగే ఏజెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇక ముందు కూడా ఏజెంట్ పరిస్థితి మరింత దారుణం అవ్వొచ్చని చెప్పక తప్పదు. ఇక ఏజెంట్ ని అయితే స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా విరూపాక్ష ని కార్తీక్ వర్మ దండు తెరకెక్కించాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించగా సంయుక్త మీనన్ అయితే హీరోయిన్ గా నటించింది.