వైరల్ : ‘దేవర’ లుక్ లో అప్పుడే తన ఓట్ వేసేసిన ఎన్టీఆర్..!

గ్లోబల్ ఫినామినా చిత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ సినిమా హీరోలు రామ్ చరణ్ సహా ఎన్టీఆర్ లతో గ్లోబల్ గా ఎలాంటి క్రేజ్ వచ్చిందో తెలిసిందే. దీనితో ఆ క్రేజ్ నిలబెట్టుకోడానికి ఇద్దరు కూడా పలు భారీ చిత్రాలు చేస్తుండగా ఈ సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో “దేవర” అనే సెన్సేషనల్ సబ్జెక్టు ని అయితే చేస్తున్నాడు.

కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా షూట్ గ్యాప్ లోనే తెలంగాణ ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈరోజు ఉదయం నుంచే ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అవ్వగా తెల్లవారు తోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి దర్శనం ఇచ్చాడు.

తన ఓట్ ని వేసేందుకు తాను మాత్రమే కాకుండా మొత్తం తన ఫ్యామిలీతో రావడంతో అయితే ఇప్పుడు పలు ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ నడుమ యిట్టె వైరల్ గా మారిపోయాయి. మరి వైట్ తీ షర్ట్ అండ్ గాగుల్స్ పెట్టుకుని ఎన్టీఆర్ స్టైలిష్ లుక్స్ లో అదరగొట్టగా దేవరకి ఇపుడు తాను ప్రిపేర్ చేసిన లుక్ లో కనిపించేసరికి తన విజువల్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి.

మరి ఇంత పొద్దున్నే ఓట్ వేసేందుకు వచ్చిన మొదటి సెలెబ్రెటీ కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఓటింగ్ వీడియో మరియు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.