ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర వినిపిస్తున్న హీరోస్ పేర్లలో టాలీవుడ్ స్టార్ హీరో ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరు కూడా ఒకటి. మరి తాను నటించిన చిత్రం “సలార్” తో తన కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ ని అందుకోగా ఈ సినిమా తర్వాత కూడా ప్రభాస్ నుంచి ఎన్నో మాసివ్ కాంబినేషన్ లు ప్రపంచ స్థాయి సినిమాలు కూడా ఉన్నాయి.
కాగా ఇదిలా ఉండగా ప్రభాస్ నటిస్తున్న ఆ చిత్రాల్లో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. కాగా దీనికి “కల్కి 2898ఎడి” అనే టైటిల్ ని కూడా లాక్ చేయగా మేకర్స్ ఇందులో ప్రభాస్ ని ఓ సూపర్ హీరో లెవెల్లో ప్రెజెంట్ చేశారు.
అయితే ఈ అవైటింగ్ సినిమా నుంచి ఆల్రెడీ టీజర్ ఫస్ట్ లుక్ అన్ని వచ్చాయి. మరి ట్రైలర్ ఎప్పుడు అనే ప్రశ్నకి నాగ్ అశ్విన్ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. తాము సినిమా సినిమా ట్రైలర్ ని సరిగ్గా మరో 93 రోజుల్లో విడుదల చేస్తామని తాను తెలిపాడు. అయితే చాలా స్పాంటేనిస్ గా ఆన్సర్ ఇచ్చిన నాగ్ అశ్విన్ ఇక్కడే చిన్న మెలిక పెట్టాడు.
అదేమిటంటే మరో 93 రోజుల తర్వాత వచ్చేది డేట్ ఏప్రిల్ 1. మరి ఏప్రిల్ 1 అంటే అందరికీ తెలిసిందే. ఫూల్స్ డే. అందుకే కావాలనే ఈ డేట్ ని చెప్పాడా అని డౌట్ చాలా మందికి అనిపిస్తుంది. మరి దర్శకుడు కావాలనే ఇలా చెప్పాడా లేక నిజంగానే అప్పుడు ట్రైలర్ వస్తుందా అనేది మాత్రం అప్పటి వరకు ఆగి చూడాల్సిందే. కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొనె అమితాబ్ బచ్చన్ లాంటి భారీ తారాగణం నటిస్తున్నారు.