బాక్సాఫీస్ : ఫస్ట్ డే అదరగొట్టిన కిరణ్ అబ్బవరం సినిమా.!

ఈ శివరాత్రి కానుకగా టాలీవుడ్ దగ్గరకి మరో మూడు సినిమాలు రిలీజ్ కి వచ్చాయి. వాటిలో యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం “వినరో భాగ్యము విష్ణుకథ” కూడా ఒకటి. కాగా ఈ సినిమాని నోటెడ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించడం తో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమా శివరాత్రి రోజు ముందే ప్రీమియర్స్ సహా సినిమా టాక్ కూడా అక్కడ నుంచి బాగానే స్ప్రెడ్ అవ్వడంతో మొదటి రోజు ఓవరాల్ గా సూపర్ వసూళ్లు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం తన బిగ్ హిట్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం కన్నా ఎక్కువే ఇది మొదటి రోజు రాబట్టిందట.

ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 2.75 కోట్లు గ్రాస్ రాబట్టినట్టుగా వారు అనౌన్స్ చేశారు. దీనితో మొత్తానికి ఈ యంగ్ హీరో ఖాతాలో రెండు వరుస ప్లాప్స్ తర్వాత మంచి హిట్ పడింది అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో కాశ్మీర పర్దేసి హీరోయిన్ గా నటించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.

అలాగే మురళి శర్మ మరియు ఎల్ బి శ్రీరామ్ తదితరులు ఈ సినిమాలో నటించగా దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అలాగే ఈ ఆదివారం కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతుంది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.