గాసిప్స్ : ఈ కుర్ర హీరో కోసం ఏకంగా పవన్ కళ్యాణ్ దిగుతున్నాడట

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాలు షూటింగ్స్ తో పాటుగా పవన్ అయితే తన పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ అయితే మధ్యలో ఓ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం హాజరు కాబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఆ సినిమా మరెవరిదో కూడా కాదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వీరభూమని అయినటువంటి హీరో కిరణ్ అబ్బవరం కోసం అట. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమానే “రూల్స్ రంజన్” కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ రావడం ఆల్ మోస్ట్ ఫిక్స్ అయ్యిందట.

అయితే పవన్ లాంటి బిగ్ స్టార్ ఈ చిన్న హీరో సినిమాకి రావడం ఏంటా అని చాలా మందికి షాకింగ్ అని చెప్పాలి. ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ పవన్ రావడం దాదాపు ఖరారు అని అంటున్నారు. కాగా పవన్ రావడానికి అయితే కారణం గట్టిదే ఉందట.

రూల్స్ రంజన్ చిత్రాన్ని తెలుగు స్టేట్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది మరేదో సంస్థ కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు నిర్మాత ఏ ఎం రత్నమే.. సో అలా ఈ చిన్న సినిమా కోసం మేకర్స్ పవన్ ని తీసుకొస్తున్నారట. ఇప్పటికే వీరమల్లు సినిమా షూటింగ్ ని పవన్ చెయ్యట్లేదు. సో పవన్ ఇమేజ్ ని ఇలా అయినా వాడితే తాము డిస్ట్రిబ్యూట్ చేసే ఈ సినిమాకి వాడుకుంటున్నారు. ఇంకా దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.