సినిమా అనేది ఓ మాయ. సక్సెస్ కిక్కులో ఊగుతున్నంత సేపూ బాగానే వుంటుంది. ఒక్కసారి ఆ కిక్కు రివర్స్ గేర్ వేస్తే ఇక అంతే సంగతి. ఇప్పుడు అదే పరిస్థితిలో వున్నాడు కిరణ్ అబ్బవరం. అనూహ్యంగా హీరో అయిపోయాడు. అంతే అనూహ్యంగా జీరో స్థాయికి పడిపోతున్నాడు.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాకే మనోడి పని అయిపోయింది. అబ్బే.! లేదు లేదు ఈ సినిమా హిట్టు, సూపర్ హిట్టు అన్నాడు. ఇంకా చెప్పాలంటే కాస్త అతి కూడా ఎక్కువే చేశాడు.
ఇక, ఇప్పుడు ‘మీటర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చాడు. కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోయింది ఈ సినిమా. ఈ సారైనా మనోడు మారతాడో, లేదో కానీ, ఇప్పటికే కిరణ్ అబ్బవరం సైన్ చేసిన రెండు ప్రాజెక్టులు ‘మీటర్’ దెబ్బకి వెనక్కి వెళ్లిపోయాయని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజెమంతో తెలీదు కానీ, మొత్తానికి మనోడి జోరు మాత్రం పడిపోయిందనే అంటున్నాయ్ ఇండస్ట్రీ వర్గాలు.