ట్రైలర్ టాక్ : మాస్ “మీటర్” కిరణ్ అబ్బవరం.!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా వినరో భాగ్యము విష్ణు కథ తో మంచి హిట్ ని తన కెరీర్ లో అందుకొని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక దీనితోనే తన కెరీర్ లో పెద్ద హిట్ అందుకోగా ఇక నెక్స్ట్ కొత్త దర్శకుడు రమేష్ కాడూరి తో అయితే మాస్ సినిమా చేసాడు.

ఆ సినిమానే “మీటర్”. ఒక పక్కా ప్రాపర్ మాస్ మసాలా సినిమాగా ఇది తెరకెక్కగా ఇప్పుడు అయితే చిత్ర యూనిట్ సినిమా ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ మొన్న టీజర్ తరహాలోనే ఇంట్రెస్టింగ్ గా మాస్ ఎలిమెంట్స్ తో ఉందని చెప్పాలి.

ముఖ్యంగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి తన డెబ్యూ సినిమా అయినప్పటికీ గ్లామరస్ గా పలు సీన్స్ తో ఊహించని ట్రీట్ నే ఇచ్చింది ఇక నెక్స్ట్ అయితే కిరణ్ అబ్బవరం తన మాస్ ని చూపించాడు. కాప్ గా తనపై చూపించిన సీన్స్ కూడా మంచి ఆసక్తిగా ఉండగా ఓవరాల్ గా అయితే ఓ పర్ఫెక్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది కనిపిస్తుంది.

అలానే లాస్ట్ ల్లో డైలాగ్స్ కూడా మంచి హైలైట్ అయ్యాయి. ఇంకా నేపథ్య సంగీతం కూడా ట్రైలర్ లో బాగుంది. మరి ఈసారి మాస్ తో వస్తున్న ఈ యంగ్ హీరో ఎలాంటి వసూళ్లు అందుకుంటాడో చూడాలి. అలాగే మరో పక్క ఈ సినిమా మాస్ మహారాజ రవితేజ రావణాసుర తో ఏప్రిల్ 7న రిలీజ్ కి రాబోతుంది మరి ఆ పోటీలో నిలబడుతుందో లేదో చూడాలి. కాగా ఈ సినిమాని అయితే క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.