చైల్డ్ ఆర్టిస్ట్ గా సీరియల్ లో మెరిసిన విజయ్.. వైరల్ అవుతున్న వీడియో!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలలో కీలకపాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. ఆ తర్వాత విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, గీతగోవిందం, డియర్ కామ్రేడ్స్ వంటి చిత్రాలు వరుసగా హిట్ అవటంతో ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు రౌడీ హీరోగా గుర్తింపు పొందాడు. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అయింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు రౌడీ హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న విజయ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. విజయ్ సినిమాలలోకి రాకముందే చైల్డ్ ఆర్టిస్ట్‏గా స్క్రీన్ పై మెరిశాడు. విజయ్ దేవరకొండ తన పాఠశాల విద్యను ఆంధ్ర ప్రదేశ్ లోని పుట్టపర్తిలో ఉన్న శ్రీ సత్య సాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో అభ్యసించాడు. ఆ సమయంలో శ్రీ సత్య సాయి బాబా గురించి ఆయన జీవిత చరిత్రను తెలుపుతూ ఒక సీరియల్ రూపొందించారు. ఆ సీరియల్ లో విజయ్ కూడా నటించాడు. ఆ సీరియల్లో ఒక్క డైలాగ్ చెప్పిన వీడియో ని విజయ్ ఇటీవల సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఎంతో హాండ్సమ్ గా విజయ్ చిన్నతనంలో ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన లైగర్ సినిమా కూడా విజయ్ కి మంచి హిట్ ఇచ్చింది. ఈ రోజు విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా విజయంతో విజయ్ అకౌంట్ లో మరొక హిట్ పడ్డట్టే. ఇక విజయ్ దేవరకొండ జనగణమన, ఖుషి సినిమాలలో కూడా నటిస్తున్నాడు. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ పనులు పునః ప్రారంభం కానున్నాయి.