తాజాగా ‘మహారాజ’తో మరో హిట్‌ను అందుకున్నారు హీరో విజయ్ సేతుపతి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో జరిగిన గొడవ పై స్పందించారు. ఆయన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టిందన్నారు. ఏ నటుడికైనా దర్శకులతో విభేదాలు సాధారణమన్నారు. ‘నానుమ్ రౌడీ థాన్’ (తెలుగులో ‘నేను రౌడీ’) తొలిరోజు షూటింగ్ తర్వాత విఘ్నేశ్‌కు ఫోన్ చేసి గొడవ పడ్డాను.’నువ్వు నాకు నటన నేర్పుతున్నావా.. నేను చేసేది నీకు అర్థం కావడం లేదు’ అని గట్టిగా అరిచాను. నాలుగు రోజుల తర్వాత నయనతార మా ఇద్దరితో మాట్లాడి నచ్చచెప్పింది. విక్కీ ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. అందుకే వెంటనే అంగీకరించాను. షూటింగ్ ప్రారంభమయ్యాక ఆయన్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.
ఇప్పుడు మంచి స్నేహితులమయ్యాం. ఆ సినిమాలో నా పాత్ర తెలుసుకోవడానికి నాలుగు రోజులు పట్టింది. అందులో కొన్ని సన్నివేశాల్లో చేసేటప్పుడు అభద్రతాభావానికి లోనయ్యాను. విఘ్నేశ్ ప్రతిభ ఉన్న దర్శకుడు ఎవరూ టచ్ చేయని కథలను గొప్పగా తీయగలరు. ఆయనపై నమ్మకం ఉంచితే అద్భుతాలు సృష్టిస్తాడు’ అని ప్రశంసించారు.
నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజపై ఇండస్టీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా నటి కీర్తి సురేశ్ ఈ చిత్రంపై పోస్ట్ పెట్టారు. తమిళ ఇండస్ట్రీలో ‘మహారాజ’ ఓ అద్భుతమన్నారు. విజయ్ సేతుపతి 50వ సినిమా ట్రేడ్ మార్క్‌గా నిలిచిపోతుందని.. స్క్రిన్‌ప్లే బాగుందన్నారు.