Dhanush – Nayanata: కోలీవుడ్‌లో నయనతార-ధనుష్ మధ్య వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. నయనతార జీవితంపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల కాగా, ఇందులో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే సినిమా షూటింగ్ సెట్‌లో తీసిన ఒక క్లిప్ ఉపయోగించారు. ఈ క్లిప్‌పై ధనుష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నయనతారపై కోర్టులో 10 కోట్లు నష్టపరిహారం కోరుతూ నోటీసులు పంపించారు.
ఈ కేసు తీవ్ర చర్చనీయాంశమైంది. నయనతార ధనుష్ ఆరోపణలకు కౌంటర్‌గా ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. తమ డాక్యుమెంటరీలో వీడియో ఉపయోగించడం పట్ల ఎలాంటి అనుమతి లేకుండా అనైతికంగా చూపడం లేదని, ఇది పూర్తిగా డాక్యుమెంటరీ టీమ్ నిర్ణయమని పేర్కొంది. ఈ వివాదం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చగా మారింది.
ధనుష్ అభిమానులు నయనతార, ఆమె భర్త విగ్నేష్ శివన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. “విగ్నేష్‌కు మొదటి బిగ్ బ్రేక్ ఇచ్చింది ధనుష్” అంటూ ధనుష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయనతార అభిమానులు కూడా దీనికి కౌంటర్ ఇస్తున్నారు. “ఒకరికి బ్రేక్ ఇచ్చినంత మాత్రాన హక్కులు లేని క్లిప్‌పై ఇంత కఠినతరమైన చర్య తీసుకోవడం అనవసరం” అని అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం నేపథ్యంలో విగ్నేష్ శివన్ తన ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది.
సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం, సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, విమర్శల నేపథ్యంలో విగ్నేష్ శివన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ట్రోలింగ్‌కు సమాధానం చెప్పడానికి సమయం లేదు. నా ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి అని ఆయన తన సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం విగ్నేష్ శివన్ ప్రదీప్ రంగనాథ్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ట్రోలింగ్, విమర్శల నుంచి దూరంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, కొందరు “విగ్నేష్ ధనుష్ అభిమానుల విమర్శలకు భయపడి ఇలా చేశాడా?” అని ప్రశ్నిస్తున్నారు.