విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ … ఎప్పుడంటే ?

vijay selfie with fans

కరోనాతో మూతబడ్డ థియేటర్స్ తిరిగి మళ్లీ ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. దీనితో థియేటర్ లోకి సినిమాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తలపతి విజయ్‌ నటిస్తోన్న యాక్షన్‌ మూవీ మాస్టర్‌ ​సంక్రాంతి బరిలో దిగనుంది. 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా మాస్టర్‌ థియేటర్లలలో సందడి చేయనుందని చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

ఈ మేరకు దర్శకుడు మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. తమిళం‌తో పాటు తెలుగు భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్‌ అవ్వనుంది. ఈ సినిమాలో మాస్టర్‌లో విజయ్‌కు జోడిగా మాళవిక మోహన్ నటిస్తున్నారు. మరో నటుడు విజయ్‌ సేతుపతి పవర్‌ఫుల్‌ విలన్‌పాత్రలో కనిపించనున్నాడు.

తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇక మాస్టర్‌ విడుదల తేదీ ప్రకటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు