టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి అందరికీ సుపరిచితమే.విజయ్ దేవరకొండ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు. ఇలా పాన్ ఇండియా సినిమాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన మొదటి పాన్ ఇండియా సినిమాతోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నారు.ఈ విధంగా ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తన తదుపరి సినిమాల విషయంలో ఈయన ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ పిన్ హాస్పిటల్ లో జరిగినటువంటి ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజయ్ దేవరకొండ అనూహ్యమైన నిర్ణయం తీసుకోవడంతో విజయ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాను ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి ఎంతో అనారోగ్యానికి గురైతే పిన్ హాస్పిటల్ వైద్యులు తన తండ్రికి మెరుగైన వైద్య చికిత్స అందించి తన కుటుంబానికి ఎంతో సహాయం చేశారు.అలాగే ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ ఆర్కాన్ డొనేషన్ కార్యక్రమానికి నేను రావడం ఎంతో ఆనందంగా ఉంది అని తెలిపారు. అదే విధంగా తన మరణాంతరం తన ఆర్గాన్స్ అన్నింటిని డొనేట్ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఈయన ప్రకటించారు. మనం చనిపోయిన తర్వాత మన అవయవాలు ఇతరుల జీవితాలలో వెలుగులు నింపుతాయంటే అందరికీ ఆనందం. ఇలా ఇతరుల కళ్ళల్లో సంతోషం చూడటం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయ్ ఈ సందర్భంగా తన ఆర్గాన్ డొనేషన్ గురించి తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.