విజయ్ దేవరకొండ మారిపోయాడు.!

గత కొన్ని రోజులుగా యాంకర్ అనసూయ ఆంటీకీ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకీ మధ్య రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా విజయ్ దేవరకొండపై అనసూయ సెటైర్లతో రెచ్చిపోతోంది. అయితే, అనసూయ విషయంలో పూర్తిగా లైట్ తీసుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఇదివరకట్లా అయితే సోషల్ మీడియా వేదికగా ఇంత రచ్చ జరుగుతున్నందుకు ఒక చిన్న సెటైర్ అయినా వేసుండేవాడు అనసూయ మీద.

కానీ, అలా చేయలేదు. పూర్తిగా కామ్‌గా వున్నాడు. ‘లైగర్’ ఫెయిల్యూర్ తర్వాత విజయ్ దేవరకొండలో వచ్చిన ఈ మార్పుకు అందరూ మెచ్చుకోకుండా వుండలేకపోతున్నారు.

ప్రస్తుతం రౌడీ వున్న ఫెయిల్యూర్ స్టేటస్‌లో ఆయన గురించి పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కానీ, తాజా పరిస్థితులు విజయ్ దేవరకొండపై ఫోకస్ పెంచేలా చేశాయి.

విజయ్ గురించి గొప్పగా మాట్లాడుకునేలా చేస్తున్నాయ్. ఆ స్టేటస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు రౌడీ. కొంతమంది మీడియా ఫ్రెండ్స్ అడిగారట అనసూయ గొడవ విషయంలో రెస్పాండ్ అవ్వమని. కానీ, సింపుల్‌గా నో చెప్పేశాడట రౌడీ.