నా దృష్టిలో అద్భుతమైన శక్తివంతమైన మహిళ తనే.. విజయ్ షాకింగ్ కామెంట్స్?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. చార్మి పూరి జగన్నాథ్ కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు. తాజాగా హైదరాబాద్లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. దీంతో బాలీవుడ్ లో కూడా విజయ్ కి మంచి గుర్తింపు ఏర్పడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ మీద మనసు పారేసుకున్నారు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న వీరిద్దరూ విజయ్ దేవరకొండ తో కలిసి డేటింగ్ చేయాలని ఉందని తమ కోరికని వెల్లడించారు.

ఇటీవల ఈ షో కి ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కూడా హాజరై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇక తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ షోలో సందడి చేశాడు. విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ హీరోయిన్ అనన్య పాండే కూడా ఈ షో లో పాల్గొన్నారు. అయితే ఈ షోలో పాల్గొన్న విజయ్ కరణ్ అడిగిన కొన్ని ప్రశ్నలకు బోల్డ్ గా సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ లు అంటే నీకు ఇష్టమా అని కరణ్ అడగ్గా.. విజయ్ స్పందిస్తూ..’సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్’ విషయం ఎక్కడి వరకు వెళ్తుందోనని భయపడుతున్నాను. వారిద్దరు కైండ్ అండ్ స్వీట్ అంటూ బదులిచ్చాడు.

ఆ తర్వాత వీరిద్దరిలో ఎవరూ ఎక్కువగా హాట్ గా కనిపిస్తారని కరణ్ ప్రశ్నించగా.. ఇద్దరూ ఆకర్షణీమైన వారేనని విజయ్ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ షో లో కరణ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమంత పేరు చెప్పారు. మన దేశంలో నువు ఎక్కువగా ఇష్టపడే మహిళ ఎవరు అని కరణ్ అడగ్గా.. సమంత పేరు చెబుతూ..తను ఒక అద్భుతమైన, పవర్ఫుల్ లేడి అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్నారు. లైగర్ సినిమా షూటింగ్ పూర్తి అవటంతో ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి.