సినీ కెరీర్‌లో విజయ్ దేవరకొండ హీరోగా తీసిన వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా చాలా బాధనిపించిందని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా అన్నారు. ఆ సినిమాకు అప్పట్లో 10% కూడా కలెక్షన్లు రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమయంలో హీరో రెస్పాండ్ కాకపోవడం అనేది కూడా తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ఆయన వాపోయారు.
అంతకుముందు అర్జున్ రెడ్డి చేశానన్న ఆయన, ఆ సినిమాతో ఆ హీరోకు మార్కెట్ కూడా పెరిగిందని ఆయన చెప్పారు. దాంతో ఈ సినిమా రిలీజ్ అవడంతో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజం చెప్పాలంటే వాళ్లంతా బాధ్యత కలిగిన హీరోలుగా కదా.. వాళ్లకే తెలిసుండాలి కదా.. మా వాళ్ల వేరే వాళ్లకి ఇన్ని డబ్బు పోయానని కొంచెమైనా ఉండాలి కదా అని ఆయన ప్రశ్నించారు. తమకు కమిషన్ వచ్చేది చిన్న పార్ట్ కావచ్చు గానీ, ఆ సినిమాను రిలీజ్ చేయడానికి చాలా కష్టపడాలని ఆయన చెప్పారు. ఫైనల్‌గా పేరు వచ్చేది మాత్రం హీరోకే అని ఆయన చెప్పారు. కాబట్టి హీరోకు ఆ రెస్పాన్స్‌బులిటి ఉండాలి కదా .. అని ఆయన అన్నారు.
ఒక సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే, ఆ సంతోషాన్ని అందరితో పంచుకుంటారు కదా.. ? అలాంటిది తన వల్ల డబ్బులన్నీ పోయి లాస్‌లో ఉన్నపుడు నా ఫోనే స్విచ్ఛాప్ చేస్తే, ఎలాంటి రెస్పాండ్ లేకపోతే చాలా బాధనిపిస్తుంది కదా అని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఒక సినిమా పోతే, ఆ తర్వాత ఇంకో సినిమా హిట్ అవుతుంది కదా.. అది అలా కంటిన్యూ కావాలి కదా అని ఆయన అన్నారు. ఆ సినిమా వల్ల తానే కాదు. చాలా మంది బయ్యర్స్ కూడా నష్టపోయారని, కానీ హీరో అన్న తర్వాత కనీసం రియాక్ట్ కాకుండా ఏమీ పట్టనట్టు ఉండడం మాత్రం తనకు చాలా బాధకు గురిచేసిందని ఆయన వివరించారు.