స్టార్ హీరోయిన్ మోజులో పడి భార్యకు విడాకులు ఇవ్వటానికి సిద్ధపడ్డ విజయ్ దళపతి…?

thalapathy-vijay-s-vaarasudu-aka-varisu-movie-working-HD-stills-

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దళపతి గురించి తెలియని వారు అంటూ ఉండరు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విజయ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విజయ్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక ఇటీవల విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా విడుదలై మంచి హిట్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా విజయ్ విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇవ్వనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే విజయ్ తన భార్యకి విడాకులు ఇవ్వటానికి ఒక స్టార్ హీరోయిన్ కారణమని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. 22 ఏళ్ల విజయ్ వివాహ జీవితంలో ఆ స్టార్ హీరోయిన్ చిచ్చు పెట్టిందని, ఆమె మోజులో పడి విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వటానికి సిద్ధపడినట్లు సమాచారం. ఈ తరుణంలో విజయ్ వారీసు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంగీత హాజరు కాకపోవటమే కాకుండా డైరెక్టర్ అట్లీ భార్య ప్రియా సీమంతం వేడుకలకు కూడా విజయ్ ఒక్కడే హాజరయ్యాడు. ఈ సంఘటనల వల్ల వీరి విడాకుల వార్తలు మరింత ఊపందుకున్నాయి.

ఇలా వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి కారణం ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ అని తెలుస్తోంది. సర్కార్, బైరవ విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించారు. ఈ క్రమంలో ఇద్దరిమధ్య అనుబంధం పెరిగిందని, ప్రస్తుతం ఇద్దరు డేటింగ్ లో ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా విజయ్ 67 వ సినిమా లో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇలా వీరిద్దరూ మరొక సినిమాలో జంటగా నటిస్తుండటంతో విజయ్ కి ఆయన భార్య సంగీత కి మద్య విభేదాలు తలెత్తాయని, అందుకే తమ 22 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకుల ద్వారా స్వస్తి చెబుతున్నట్లు సమాచారం.