Beast Movie: విడుదలకు ముందే అద్భుతమైన రికార్డు సృష్టించిన విజయ్ ‘బీస్ట్’ సినిమా!

Beast Movie: కోలీవుడ్ స్టార్ హీరో ‘దళపతి’ విజయ్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అందం, అభినయం ఎందులోనూ తక్కువ కాదంటూ తన స్టార్‌డమ్‌ను రోజురోజుకూ పెంచుకుంటూ పోతోంది. అయితే వీరిద్దరూ కలిసి ఇటీవల జంటగా నటించిన చిత్రం ‘బీస్ట్‌’. ‘డాక్ట‌ర్’ ఫేం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై భారీ అంచ‌నాల‌ను నమోదు చేశాయి. దాంతో దళపతి ఫాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా బీస్ట్‌ చిత్ర బృందం ట్రైల‌ర్ విడుద‌ల తేదీని ప్రకటించడంతో ఈ మూవీ అభిమానుల్లో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. యాక్షన్ కామెడీ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఉగాది సంద‌ర్భంగా ఏప్రిల్ 2న సాయంత్రం 6 గంటలకు విడుద‌ల చేయ‌బోతున్నట్లు మూవీ మేకర్స్ ఇప్పటికే ప్రక‌టించారు.

ఇదిలా ఉండగా ఇటీవలి కాలంలో ఈ సినిమాలోని అరబిక్ కుత్తూ అనే సాంగ్ సోషల్ మీడియాని ఎంత ఊపేసిందో అందరికీ తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పలువురు సెలబ్రెటీలు ఈ పాటకు రీల్స్ చేస్తూ సందడి చేశారు. దీంతో ఈ సాంగ్‌ ఊహించని రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక తాజా ఈ పాట 250 మిలియన్ల వ్యూస్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇంత భారీ స్థాయిలో మారు మోగుతున్న ఈ పాటను రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద్రన్ ఆలపించగా, శివ కార్తికేయక్ సంగీతం అందించారు. ఇక పోతే పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 13న ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కానుండడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.