మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సమయంలో హీరోయిన్‌లపై వేధింపులు ఆగడం లేదు. కుర్ర హీరోయిన్స్‌నే కాదు స్టార్ సెలబ్రిటీస్‌ని కూడా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నాయకుల వైఖరి పట్ల మహిళలు గ్లామర్ ఫీల్డ్‌కు రావాలంటేనే భయపడుతున్నారు. బుజ్జగించో, భయపెట్టే వారిని తమ వశం చేసుకుంటారని భయపడుతున్న క్రమంలో అప్‌కమింగ్ హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యాబాలన్‌ను మధ్యప్రదేశ్ మినిస్టర్ డిన్నర్‌కు రమ్మనడం చర్చనీయాంశంగా మారింది. వివరాలలోకి వెలితే విద్యాబాలన్ ప్రస్తుతం షేర్నీ అనే సినిమా చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ మధ్య ప్రదేశ్ అడవులలో చేయాల్సి ఉంది. ఇందుకోసం ముందస్తు పర్మీషన్‌ను మంత్రిగారు ముందట పెట్టుకున్నారు. దొరికిందే ఛాన్స్ అనుకున్న మంత్రి.. విద్యాబాలన్‌ని తనతో పాటు డిన్నర్‌కు రావాలని చెప్పాడట. అందుకు ఆమె నిరాకరించడంతో షూటింగ్ పర్మీషన్‌ను క్యాన్సిల్ చేసినట్టు సమాచారం
ఈ విషయంపై పలు ప్రతికలు, వెబ్ సైట్స్ వరుస కథనాలు ప్రచురిస్తుండడంతో మంత్రి విజయ్ షా స్పందించారు. నేను డిన్నర్‌కు పిలిచినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. సినిమా యూనిట్ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించింది. అయితే పర్మీషన్ ఇవ్వకపోవడంతో వారు విందు క్యాన్సిల్ చేసుకున్నారంటూ మంత్రి వివరణ ఇచ్చారు. ఈ వివాదం ముంబై నుంచి ఢిల్లీ వరకూ సంచలనం రేపుతోంది.