వీడియోలు మన రోజువారీ జీవితాల్లో ఓ భాగమయ్యాయి. కానీ ఈసారి సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌ను ఆగ్రహించిన ఎద్దు ఎలా భయంకరంగా మార్చిందో చూపించింది. పాటలు, డ్యాన్స్‌లు, ఆనందోత్సవాల మధ్య ఒక్కసారిగా బంధించిన ఎద్దు ఊచకోతలా విరుచుకుపడింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్‌లోకి వెళ్లారు.
ఓ సంగీత కార్యక్రమంలో స్టేజ్ పైన గానమాలిక కొనసాగుతుండగా, క్రింద ఉన్న వందలాది మంది ప్రేక్షకులు ఆ హుషారులో డ్యాన్స్ లు వేస్తున్నారు. ఈ సమయంలో ఇద్దరు యువకులు పట్టుకున్న ఓ ఎద్దు బీభత్సానికి తెరలేపింది. ఒక్కసారిగా విజృంభించిన అది… నేరుగా స్టేజ్‌పైకి దూసుకెళ్లి సింగర్స్ ను భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడినుంచి మళ్లీ క్రౌడ్‌లోకి దూకుతూ పలువురిని ఢీకొట్టింది. చిన్నపిల్లలు, మహిళలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కలిచివేస్తున్నాయి.
ఈ దృశ్యం ఎక్కడ జరిగిందో స్పష్టత లేకపోయినా… బంధించిన ఎద్దును స్టేజ్ సమీపంలోకి తీసుకురావడం ఎలాంటి జాగ్రత్తలు లేకుండా చేసిన అరాచకం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులందరూ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయినా ఇలాంటి ఫంక్షన్లలో జంతువులను అంత ఈజీగా ఎలా వదిలారు అనేది హాట్ టాపిక్ గా మారింది.
Panic at the disco after a Bull attack:
pic.twitter.com/KHhySUOgSC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 13, 2025