ఇప్పుడంతా ఫ్రస్టేషన్ కదా.. ఆ ఫ్రస్టేషన్ అంతా డబ్బు కోసం మాత్రమే.. వెంకటేష్ షాకింగ్ కామెంట్స్..!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఆయన నటించిన నారప్ప సినిమా ద్వారా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా దృశ్యం సీక్వెల్ చిత్రంగా దృశ్యం 2 చిత్రం ఈ నెల 25వ తేదీ అమెజాన్ ప్రైమ్ విడుదలకానుంది. ఈ సందర్భంగా వెంకటేశం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. దృశ్యం 2 సినిమాలో కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా కనిపిస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.

నేను చాలా అదృష్టవంతుడిని అనుకోకుండా సినిమాలలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపు ఎంతో మంచి ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే దృశ్యం 3 ఉండబోతుందా అనే ప్రశ్నకు వెంకటేష్ సమాధానం చెబుతూ అది వచ్చేలోగా తెల్లగడ్డం వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఎఫ్2 సినిమాలో ఎంతో ప్రస్టేషన్ గా కనిపిస్తారు. మరి ఎఫ్ 3 లో కూడా ఫ్రస్టేషన్ ఉంటుందా అని అడగడంతో ఇప్పుడంతా ఫ్రస్టేషన్ కదా అంటూ వెంకటేష్ షాకింగ్ కామెంట్ చేశారు ఇందులో డబ్బు కోసం ఫ్రస్టేషన్ ఉంటుందని తెలిపారు.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ డబ్బు అవసరం కనుక అందుకే అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని వెంకటేష్ ఎఫ్ 3 సినిమా గురించి తెలియజేశారు. ఇకపోతే రానాతో కలిసి వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా రానా నాయుడు అనే టైటిల్ తో రాబోతుందని ఇందులో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని తెలిపారు.