తాజాగా టాలీవుడ్ స్టార్ అండ్ సీనియర్ హీరో వెంకటేష్ నటించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “దృశ్యం 2” ని చిత్ర యూనిట్ నేరుగా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ కరోనా మూలాన అనేక సినిమాలు ఓటిటి లోనే రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో పలువురు స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.
అటు తమిళ్ ఇటు తెలుగులో సూర్య నాని లు నటించిన భారీ సినిమాలు ఓటిటిలో రిలీజ్ అయ్యి హిట్టయ్యాయి. దీనితో డిస్ట్రిబ్యూటర్లు నాని సూర్య విషయంలో కొంచెం హంగామా చేసారు కూడా. కానీ నిర్మాతల పరంగా అప్పుడు ఉన్న పరిస్థితులు రీత్యా ఓటిటి కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇంకా నాని విషయంలో అయితే అసలు తన సినిమాలే బ్యాన్ చేసేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు.
దీనితో నాని చాలా ఎమోషనల్ కూడా అయ్యి పరిస్థితులు మారితే ఎవరో కాదు నన్ను నేనే బ్యాన్ చేసుకుంటా అని చాలా ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సరే ఇప్పుడు నాని విషయంలో మాట్లాడిన పెద్దలు వెంకటేష్ విషయంలో మాట్లాడుతారా లేదా అనేదే ప్రశ్న. వెంకటేష్ సినిమాలు కూడా ఓటిటి రిలీజ్ కే వెళ్తున్నాయి. దృశ్యం 2 రెండో సినిమా గతంలో నారప్ప కూడా ఇంతే.
వరుసగా రెండు సినిమాలు అందులోని మంచి అంచనాలు ఉన్న సినిమాలు ఓటిటి కే ఇచ్చేయడం ఎంతవరకు కరెక్ట్ మరి. అప్పుడే వెంకీ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా వారి ఎమోషన్స్ ని డిస్ట్రిబ్యూటర్స్ కోసం కూడా ఆలోచించలేదు అన్నట్టే కదా? మరి డిస్ట్రిబ్యూటర్స్ వెంకీ మామ సినిమాలు కూడా బ్యాన్ చేస్తారో లేదో చూడాలి.