‘దృశ్యం’ లాంటి కథేగానీ, వెంకీకి నచ్చలేదట.!

ఎక్కడున్నావయ్యా విక్టరీ వెంకటేషూ.. అని అనుకుంటున్నారు ఆయన అభిమానులు. నిఖార్సయిన సినిమా వెంకటేష్ నుంచి వచ్చి చాలాకాలమే అయ్యింది. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నాడు సీనియర్ నటుడు వెంకటేష్.

త్వరలోనే తన కొత్త సినిమాతో సందడి చేయబోతున్నాడట. సరే, ఆ ‘త్వరలోనే ఎప్పుడు.?’ అన్నది పెద్ద డౌటానుమానం. చాలా కథలు విన్నాడట ఆ మధ్య వెంకీ. కానీ, ఏదీ ఆయనకు నచ్చలేదట. ‘దృశ్యం’ ప్యాటర్న్‌లో ఓ థ్రిల్లర్ కాన్సెప్ట్ పట్ల కొంత సానుకూలంగా వెంకీ వున్నట్లు తెలుస్తోంది.

అన్నీ కుదిరితే, సొంత బ్యానర్‌లోనే వెంకటేష్ ఆ సినిమా చేసే అవాకశం వుందంటున్నారు. మీనా అయితే మొనాటనీ అవుతుందా.? ప్రియమణి అయితే ఎలా వుంటుంది.? ఫర్ ఎ ఛేంజ్ అనుష్కని తీసుకొస్తేనో.? ఇలా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఇది కాకుండా రానా దగ్గుబాటితో ఓ మల్టీస్టారర్ ఆలోచన కూడా వెంకీ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో మరి.!