Urvashi Rautela : క్రికెటర్ తో ప్రేమాయణం లో బాలీవుడ్ భామ…!

Urvashi Rautela : చలన చిత్ర పరిశ్రమకు క్రికెట్ మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కొంతమంది ఇండియన్ క్రికెట్ టీం స్టార్ ప్లేయర్ లు బాలీవుడ్ హీరోయిన్ల ను ప్రేమించడం లాంటివి ఇంతకుముందు కూడా చూశాను. కొంతమంది స్టార్ క్రికెటర్లు హీరోయిన్లు ఇంకొక అడుగు ముందుకు వేసి వైవాహిక బంధంతో ఒకటయ్యారు.అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా – నటాషా, జహీర్ ఖాన్-సాగరిక  వంటివారు వివాహబంధంతో ఒక్కటై తమ జీవితాన్ని ఎంత ఆనందంగా సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాబితాలో కి మరొక చోట వచ్చి చేరబోతోంది.

వివరాల్లోకి వెళితే.. ఇండియన్ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్,బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తో గత కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ దీనిగురించి స్పందించడం కానీ అధికారిక ప్రకటన చేయడం కానీ జరగలేదు కానీ వార్తలు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం వీరిద్దరికీ సంబంధించిన ఒక వార్త బాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ అయిపోయింది. అదేంటంటే.. వారణాసి లో బిజీ షూటింగ్ షెడ్యూల్ లో ఉన్న ఊర్వశి రౌతేలా నీ కలవడానికి స్టార్ క్రికెటర్ అయిన రిషబ్ పంత్ సుమారు 20 గంటలపాటు నిరీక్షించినట్లు సమాచారం. ఇది కాకుండా గతంలో వీరిద్దరూ ముంబైలోని జవహార్ లాల్ అనే ఒక హోటల్లో ఊర్వశి, రిషబ్ పంత్ డిన్నర్ కోసం వెళ్ళినట్టుగా వార్తలు వినిపించాయి. దీంతో వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వారిద్దరికీ సంబంధించిన ఒక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కానీ బహిరంగంగా వీరిద్దరూ కలిసి కనిపించడం కానీ వీరి ఫోటోలు కానీ బహిర్గతం అవ్వలేదు. ఇప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా లేదా అన్నది ఒక హాట్ టాపిక్ అయిపోయింది. దీని గురించి వేరే ఒక ఒక ప్రకటన చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా బ్లాక్ రోజ్ సినిమాతో టాలీవుడ్ లో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.ప్రస్తుతం రిషబ్ పంత్ ఐపిఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు.