Aasha: ఊర్వశి, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, సఫర్ సనల్, వినాయక అజిత్ ‘ఆశ’ షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం

మలయాళ సినిమా పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీ ఆశలో నటిస్తున్నారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో, వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు.

త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, మధు నీలకందన్ కెమరా స్విచ్-ఆన్ చేశారు.

ఈ వేడుకలో ఆశ టైటిల్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు, ఇది ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించింది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజే ప్రారంభమైంది.

విజయరాఘవన్, ఐశ్వర్య లక్ష్మి, పాణి సినిమా ఫేమ్ రమేష్ గిరిజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఐదు భారతీయ భాషల్లో పాన్-ఇండియన్ విడుదల కానుంది.

ఈ చిత్రానికి అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, ఎడిటింగ్, షాన్ మొహమ్మద్. సంగీతం: మిధున్ ముకుందన్. సౌండ్ డిజైన్, సింక్ సౌండ్ అజయన్ అదత్, ప్రొడక్షన్ డిజైన్ వివేక్ కలథిల్, దినేష్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్.

తారాగణం: ఊర్వశి, జోజు జార్జ్, విజయరాఘవన్, ఐశ్వర్య లక్ష్మి, రమేష్ గిరిజ

సాంకేతిక సిబ్బంది:
కథ, దర్శకత్వం: సఫర్ సనల్
నిర్మాత: వినాయక అజిత్
సమర్పణ: అజిత్ వినాయక ఫిల్మ్స్
స్క్రీన్ ప్లే: జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్
సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్
ఎడిటింగ్: షాన్ మహ్మద్
సంగీతం: మిధున్ ముకుందన్
సౌండ్ డిజైన్ & సింక్ సౌండ్: అజయన్ అడత్
ప్రొడక్షన్ డిజైన్: వివేక్ కలాథిల్
మేకప్: షమీర్ షామ్స్
కాస్ట్యూమ్ డిజైన్: సుజిత్ సి.ఎస్.
స్టంట్ కోఆర్డినేషన్: దినేష్ సుబ్బరాయన్
ప్రొడక్షన్ కంట్రోలర్: షబీర్ మాలవట్టం
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: రతీష్ పిళ్లై
అసోసియేట్ డైరెక్టర్లు: జిజో జోస్, ఫెబిన్ M. సన్నీ
స్టిల్స్ ఫోటోగ్రఫీ: అనూప్ చాకో
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్: ఎల్లో టూత్స్

Public EXPOSED: Chandrababu & Pawan Kalyan Ruling || Ap Public Talk || Ys Jagan || Telugu Rajyam