‘ఉప్పెన’ ట్రైలర్ : ప్రేమంటే పట్టుకోవడం.. వదిలేయడం కాదు !

సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్‌తేజ్‌, మంగ‌ళూరు భామ కృతిశెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఉప్పెన. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో సంద‌డి చేసేందుకు రెడీ అవుతుంది. అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

నీ కళ్లు నీలి సముద్రం, ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్ర ముగ్దుల్ని చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఆ సినిమా పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు.

తాజాగా.. సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’ అంటూ ట్విటర్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు. రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్‌ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘ఉప్పెన’ గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

ప్రేమంటే ఓ లైలా మజ్ను లా.. దేవదాసు పార్వతి లా.. ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాలి రా’ అంటూ హీరో చెప్పే డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ‘ప్రేమంటే పట్టుకోవడం.. వదిలేయడం కాదు..’ ‘ప్రేమ గొప్పదైతే చరిత్రలోనో సమాధుల్లోనో కనపడాలి కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇళ్లల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదూ.. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటది.. దానికి భవిష్యత్తు ఉండదు’ వంటి డైలాగ్స్ సినిమా డెప్త్ ఎలా ఉందొ తెలియజేస్తుంది. విజయ్ సేతుపతి హీరోయిన్ తండ్రిగా నెగెటివ్ రోల్ లో కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టి ఇద్దరూ తొలి సినిమా అయినప్పటికీ మంచి నటన కనబరిచినట్లు అర్థం అవుతోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక విషాదాంత ప్రేమకథ అనే అనుమానం కలుగుతోంది.

Uppena Telugu Movie Trailer | Panja Vaisshnav Tej | Krithi Shetty | Vijay Sethupathi | Buchi Babu