‘విక్రమ్’ ఫస్ట్ లుక్ : ముగ్గురు మొనగాళ్లతో లోకేష్ కనగరాజ్ ఏం చేయబోతున్నారో ?

‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న చిత్రం “విక్రమ్”. ఈ మూవీ నుండి ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ తమిళ పరిశ్రమనే కాదు దక్షిణాది మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. ఈ ఫస్ట్ లుక్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ వంటి నేషనల్ అవార్డు విన్నింగ్ నటులు ముగ్గురూ ఇంటెన్స్ లుక్స్ తో కనిపించటం చాలా బాగుంది. సినీపరిశ్రమలో ప్రతిభావంతులైన ముగ్గురు నటులు కలయికను చూడగానే అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వీరందరితో ఎలాంటి మాయాజాలం తీయబోతున్నారో అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

First Look Poster From Vikram Movie

కమల్ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య విడుదలైన విక్రమ్ సినిమా టీజర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. జస్ట్ ఆ టీజర్‌తో సినిమా మీద అంచనాలు కూడ పెరిగాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ తో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరాయి. కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్‏నేషనల్ ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. మరోవైపు కమల్ ‘పాపనాశనం’ మూవీ సీక్వెల్ ను పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. అయితే శంకర్, కమల్ కాంబోలో మొదలైన ‘ఇండియన్ 2’ మూవీ పరిస్థితి మాత్రం ఇంకా అయోమయంలోనే ఉందని తెలుస్తుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles