తమిళ్ స్టార్ హీరో సినిమాకి నో చెప్పిన ఉప్పెన బ్యూటీ.. అదే కారణమా..?

ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు వారు నటించిన మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అలా ఫేమస్ అయిన హీరోయిన్స్ లో కృతి శెట్టి కూడా ఒకరు. వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమా ద్వారా తొలిసారి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన అందం, అభియానయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న బెబమ్మ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఉప్పెన సినిమా మంచి హిట్ అవటంతో తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంది.

ఇటీవల ఈ అమ్మడు నటించిన బంగార్రాజు సినిమా కూడా మంచి హిట్ అందుకుంది. ప్రస్తుతం కృతి శెట్టి రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా నితిన్ హీరోగా నటిస్తున్న మాచర్ల నియోజకవర్గ సినిమాలో కూడా కథానాయక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు కాకుండా సుధీర్ బాబు హీరోగా వస్తోన్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ తో పాటు మరో రెండు సినిమాలలో కృతి శెట్టి నటించనుంది. ఇలా వరుస సినిమాలతో ఈ అమ్మడు చాలా బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా కృతి శెట్టి గురించి ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తోంది.

స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృతి శెట్టి ఒక తమిళ స్టార్ హీరో సినిమాకు నో చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్ సినిమాకు కృతి శెట్టి నో చెప్పిందని గుసగుసలు వినిపిస్తోన్నాయి. తెలుగు,తమిళ భాషలలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విశాల్ హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే విశాల్ నటించిన ‘ లాఠీ ‘ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే విశాల్ మరో సినిమాను లైనప్ చేశాడు. ఈ సినిమాలో కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని విశాల్ భావించాడట. అయితే ఇప్పటికే అరడజను పైగా సినిమాలకి ఒకే చెప్పిన కృతి ఈ సినిమా కి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో విశాల్ సినిమాకు నో చెప్పిందని టాక్. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.