మెగావారసుడు రామ్ చరణ్ ఉపాసన దంపతుల వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో ఎంతోమంది పిల్లల విషయం గురించి నేరుగా ప్రశ్నించారు. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత విషయం అంటూ ఉపాసన ఒకానొక సమయంలో ఈ విషయంపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఇలాంటి శుభవార్త ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నటువంటి మెగా అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియగానే వీరి గురించి మరొక వార్త వైరల్ అవుతుంది. మెడికల్ ఫీల్డ్ లో ఎంతో అనుభవం ఉన్నటువంటి ఉపాసన నేరుగా బిడ్డకు జన్మనివ్వలేదని సరోగసి ద్వారా వీరు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఉపాసన తన సరోగసి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టారు. థాయిలాండ్ లో తన కజిన్ వివాహం ఉండడంతో ఉపాసన రాంచరణ్ ఇద్దరు కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు.
ఈ క్రమంలోనే ఉపాసన అందరితో కలిసి ఫోటోలు దిగారు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలలో ఉపాసన బేబీ బంప్ చాలా క్లియర్ గా కనిపించడంతో వీరి సరోగసి వార్తలకు చెక్ పెట్టారనీ తెలుస్తుంది. ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఉపాసన కూడా ప్రెగన్సీ తరువాత మొదట సారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మహిళల ఆశీర్వాదంతో మాతృతత్వంలోకి అడుగుపెట్టబోతున్నాను అంటూ పోస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే.