పదేళ్లకు ఉపాసన ప్రెగ్నెంట్ అయిన సంతోషంగా లేని అంజనాదేవి.. అదే కారణమా?

మెగా వారసుడి కోసం గత పది సంవత్సరాల నుంచి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా వీరు పిల్లల గురించి ఏ మాత్రం తెలియచేయకపోవడంతో మెగా అభిమానులు ఈ విషయంలో కాస్త నిరాశ చెందటమే కాకుండా ఈ శుభవార్త కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు కోడలు తల్లిదండ్రులు కాబోతున్నారంటూ అధికారికంగా తెలియజేయడంతో ఈ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

ఇక ఈ విషయం తెలిసినటువంటి ఎంతో మంది అభిమానులు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఉపాసన రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా అందరూ ఎంతో సంతోషంలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి తల్లి మాత్రం ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటికీ సంతోషంగా లేరని తెలుస్తోంది.ఇలా అంజనాదేవి ఉపాసన విషయంలో సంతోష పడకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట అయితే ఈమె ఆందోళన వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

ఉపాసన ఆరోగ్యపరంగా ఎన్నో నియమాలను పాటిస్తారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈమె ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు ఉన్నప్పటికీ ఆమె పెళ్లయిన పది సంవత్సరాలుగా గర్భం దాల్చడంతో ఆమె ప్రెగ్నెన్సీ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలని డాక్టర్లు సూచించారట. ఈ క్రమంలోనే అంజనా దేవి ఈ విషయంలో కాస్త ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు తనలో ఈ ఆందోళన ఉంటుందని ఈమె వెల్లడించారట. అయితే సురేఖ మాత్రం తనకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది.ఇక ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉపాసనకు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా ఎలా ఉండాలో పూర్తి అవగాహన ఉండి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.