సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో హీరోయిన్లు ఇంత సక్సెస్ అనుభవిస్తున్నారు అంటే ఆ సక్సెస్ వెనుక ఎన్నో అవమానాలు ఎన్నో కన్నీటి కష్టాలు ఉంటాయి.ఇలా ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిని అనుభవించి నేడు ఈ స్థాయిలో ఉన్నారని చెప్పాలి.ఇలా కన్నీటి కష్టాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్న వారిలో కన్నడ హీరో రిషబ్ శెట్టి ఒకరు. ఈయన పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది.కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కాంతార సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా అన్ని భాషలలోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో రిషబ్ శెట్టి పేరు మార్మోగిపోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రిషబ్ తన జీవితంలో జరిగినటువంటి పలు సంఘటనల గురించి తన కన్నీటి కష్టాల గురించి తెలియజేశారు. తాను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక మినరల్ వాటర్ ప్లాంట్ లో పనిచేసే వారని తెలిపారు. ఇలా ప్రతిరోజు రాత్రి నీళ్ల క్యాన్లు సరఫరా చేస్తూ కొన్నిసార్లు అదే వ్యాన్ లో నిద్రపోయానని తెలిపారు.ఇలా కొన్ని రోజుల పాటు మినరల్ వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్న తర్వాత రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టానని తెలిపారు.
హోటల్ ప్రారంభించిన ఐదు నెలలకే భారీ నష్టాలు రావడంతో ఈ బిజినెస్ క్లోజ్ చేసానని అప్పటికే 25 లక్షల రూపాయలు అప్పు చేశానని తెలిపారు. ఇలా అప్పు చేయటంతో ఆ అప్పుకు వడ్డీ కట్టడానికి మరో అప్పు చేశానని ఇలా 2012వ సంవత్సరం వరకు అప్పులు కడుతూనే ఉన్నానని ఈయన తెలిపారు. అయితే సినిమాలపై మక్కువతో ఎన్నో వేషాలు వేస్తూ అవకాశాల కోసం ఇండస్ట్రీ చుట్టూ తిరగానని,అలాగే అప్పుల బాధ నుంచి తప్పించుకోవడం కోసం అదే వేషాలలో బయట కూడా తిరిగే వాడి నంటూ ఈ సందర్భంగా తన కన్నీటి కష్టాల గురించి రిషబ్ శెట్టి బయటపెట్టారు.