ట్విట్టర్ రివ్యూ : “దాస్ కా ధమ్కీ” టాక్ ఎలా ఉందంటే?

ఈ ఏడాది టాలీవుడ్ లో ఆల్రెడీ సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అలాగే నెక్స్ట్ పండుగ మహా శివరాత్రి కానుకగా వచ్చిన సినిమాలు కూడా అదిరే విజయాల్ని సెట్ చేయగా ఇక ఇప్పుడు ఉగాది కానుకగా కూడా వచ్చాయి. కాగా ఈ చిత్రాల్లో మంచి అంచనాలు నడుమ వచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సినిమా “దాస్ కా ధమ్కీ” కూడా ఒకటి.

మరి ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించగా నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాని విశ్వక్ సేన్ నే దర్శకత్వం వహించగా గట్టి ప్రమోషన్స్ తో అయితే ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఆల్రెడీ ప్రీమియర్స్ తో షో పడిపోగా ట్విట్టర్ లో సినిమా టాక్ అయితే వచ్చేసింది.

మరి ఓవరాల్ గా చూస్తే కాస్త ఈ సినిమాకి మిక్సిడ్ టాక్ నే కనిపిస్తుంది అని చెప్పాలి. కొంతమంది సినిమా బాగుంది అంటున్నారు కొంతమంది యావరేజ్ గా ఉంది ప్రమోషన్స్ లో లేపినంత లేదు అని అంటున్నారు. అలాగే మెయిన్ గా అయితే ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బాగా వచ్చింది అని అంటున్నారు.

అలాగే మళ్ళీ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండగా ఆడితే మరింత బాగుండొచ్చు ఏమో అని కూడా ఆడియెన్స్ చెప్పుకుంటున్నారు. ఇక విశ్వక్ సేన్ అయితే రెండు షేడ్స్ లో అదరగొట్టాడని పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అలాగే చాలా చోట్ల విశ్వక్ లో ఎన్టీఆర్ కూడా కనిపించాడని కొందరు అంటున్నారు. ఇలా చాలా వరకు మిక్సిడ్ గా రెస్పాన్స్ ఈ సినిమాకి వస్తుంది. మరో ఓవరాల్ గా ఆడియెన్స్ ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో అనేది చూడాలి.