విశ్వక్ సేన్‌కి ధమ్కీ ఇచ్చిన జూనియర్ ఎన్టీయార్.!

ఏదో అనుకుంటే, ఇంకోటేదో అయ్యింది.! ఇక ఆపెయ్యవయ్యా డైరెక్షనూ.. అంటూ చెప్పకనే చెప్పేశాడు జూనియర్ ఎన్టీయార్, విశ్వక్ సేన్‌కి.! అదేంటీ, చీఫ్ గెస్ట్‌గా పిలిస్తే, సెటైరేసి వెళ్ళాడు.? అంటూ విశ్వక్ సేన్ అభిమానులు గుస్సా అవుతున్నారు.

ఇప్పటికిప్పుడు అయితే ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ అభిమానులు, జూనియర్ ఎన్టీయార్‌ని ఏమీ అనలేరు. ఎందుకంటే, ‘దాస్ కా ధమ్కీ’ సినిమా విడుదలకు రెడీగా వుంది. ఆ ఎన్టీయార్ అభిమానులే ‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి రాజపోషకులు అవ్వాలి.

మొన్నటికి మొన్న ‘అమిగోస్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేరుగా తన అభిమానులకే ఝలక్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీయార్. ‘ఎన్టీయార్ 30’ సినిమా అప్డేట్ విషయంలో తీసుకున్న క్లాస్ అది.

ఏమయ్యింది జూనియర్ ఎన్టీయార్‌కి.? ఏ ఫ్రస్ట్రేషన్ కారణంగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్‌కి జూనియర్ ఎన్టీయార్ ధమ్కీ ఇచ్చినట్లు.? వ్యవహారం అయితే తేడా కొడుతోంది. కారణం ఏంటన్నదే తేలాలి.!