ట్విట్టర్ రివ్యూ : “బ్రో” పరిస్థితి ఏంటి బ్రో… 

మళ్ళీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ సినిమా దగ్గర పండుగ లాంటి వాతావరణం అయితే మళ్ళీ వచ్చింది. కాగా గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ లు కాంబినేషన్ లో దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన ఆ సినిమానే “బ్రో”.

అయితే ఈ చిత్రం లేదు అనుకుంటున్నా హైప్ తోనే అదిరే బుకింగ్స్ తో రిలీజ్ కి వచ్చేయగా ఎట్టకేలకు ఈ సినిమా ప్రీమియర్ షోస్ తో అయితే నిన్నటి అర్ధ రాత్రి నుంచే స్టార్ట్ అయ్యిపోయింది. కాగా బ్రో చూసినవారు అంతా కూడా సోషల్ మీడియాలో ట్విట్టర్ లో తమ రివ్యూస్ పంచుకుంటున్నారు.

అయితే వీటిలో బ్రో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని చెప్పక తప్పడం లేదు. సినిమా అనుకున్న రేంజ్ లో లేదు అని చాలా మంది అంటున్నారు. అలాగే పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే కావాల్సిన ఎలిమెంట్స్ పెట్టారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమా ఎంటర్టైనింగ్ గా అయితే లేదు అని అనేస్తున్నారు.

దీనితో బ్రో చిత్రానికి చాలా యావరేజ్ రిపోర్ట్స్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇచ్చిన మాటలు అయితే సినిమాకి చాలా బాగున్నాయట. కాగా ఈ చిత్రంలో హాట్ బ్యూటీ కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.