టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ మంది కమెడియన్ హీరోస్ లో అల్లరి నరేష్ కూడా ఒకరు. మరి నరేష్ హీరోగా కామెడీ పాత్రలు చేస్తున్న సమయంలోనే కొన్ని సీరియస్ డ్రామాలు కూడా చేసాడు. అయితే తన లోని నటుణ్ని ఓ రేంజ్ లో చూపించిన సినిమా మాత్రం “నాంది” అని చెప్పాలి.
కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం నరేష్ కెరీర్ లో మంచి హిట్ గా నిలిచింది. ఇక దీని తర్వాత ఇదే కాంబినేషన్ లో వచ్చిన రెండో సినిమానే “ఉగ్రం”. టైటిల్ కి తగ్గట్టుగానే ఓ పవర్ ప్యాకెడ్ సినిమాగా వచ్చిన ఈ సినిమా పై అయితే ఆల్రెడీ సినిమా చూసిన ట్విట్టర్ ప్రజానీకం తమ థాట్స్, రిపోర్ట్స్ చెప్తున్నారు.
అయితే ఆల్ మోస్ట్ గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం విశేషం. అయితే కొందరు రొటీన్ గానే ఉందని అంటున్నారు. అలాగే కొందరు అల్లరి నరేష్ మరోసారి తన విశ్వరూపం చూపించాడని అంటున్నారు. కాకుండా మరికొందరు అయితే ఈ సినిమా నాంది కన్నా బెటర్ గా ఉంది అంటున్నారు.
అలాగే సినిమాలో ఏక్షన్ సీక్వెన్స్ లు గాని సెంటిమెంట్స్ ముఖ్యంగా సెకండాఫ్ బాగుంది అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అయితే కాస్త ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ ఈ సినిమాకి కనిపిస్తున్నాయి. మరి దీనితో అల్లరి నరేష్ తాను కోరుకున్న అందుకుంటాడో లేదో చూడాలి. కాగా ఈ చిత్రంలో మిర్న హీరోయిన్ గా నటించగా ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే శ్రీచరణ్ పాకల సంగీతం అందించాడు.
Slow into proceedings in 1 half with good interval sequence makes it decent, 2 nd half deep into story of solving the mystery with twist through engaging screenplay, makes it better 2 nd half@allarinaresh acting👌💥, kid character❤️, fights – cinematography – Bgm🔥
3/5#Ugram https://t.co/h589UXspsU
— 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.ᶜᴮᴺ (@Niteesh_09) May 4, 2023
Done with the movie. Director has taken different issues(?) to create a big impact on story but he failed miserably. You’ll laugh at some senseless scenes but there are some good scenes as well. Overall, strictly below average. 2.5/5 #Ugram
— Venkat Kondeti (@venkatpazzo) May 4, 2023
#Ugram is a different attempt from @allarinaresh mainly the second half is excellent 👌. Action sequences are kickass. BGM is very haunting @SricharanPakala 😎😎 #vijaykanakamedala 🥳🥳🥳
— saisrikar sharma (@saisrikardhava1) May 4, 2023
#Ugram routine and booooringggg 0.5/5
— Tony (@SR1199) May 5, 2023