చాలా కాలం తర్వాత ఇండియన్ సినిమా దగ్గర టాలీవుడ్ హీరో నుంచి వెళ్లనున్న ఓ సినిమా అయితే మళ్ళీ వసూళ్లతో భారీ లెక్కలు సెట్ చేయడానికి రెడీ అవుతుంది. మరి ఆ సినిమానే “సలార్”. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు.
అయితే ఈ సినిమా విషయంలో ఎప్పటి నుంచో ఓ క్రేజీ రూమర్ ఉంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ యొక్క మొదటి చిత్రం “ఉగ్రం” కి రీమేక్ అని చెప్పి స్టార్టింగ్ నుంచే కొన్ని వాదనలు ఉన్నాయి. అంతే కాకుండా షూట్ స్టార్ట్ కాక మునుపే సంగీత దర్శకుడు కూడా సలార్ ఉగ్రం కి రీమేక్ అని చెప్పాడు.
కానీ తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఇది రీమేక్ కాదు అని చెప్పడానికి చాలా డిఫెండ్ చేశారు. తర్వాత నిర్మాత గాని దర్శకుడు ప్రశాంత్ నీల్ కానీ సలార్ కొత్త స్టోరీ అని చెప్పి ఫ్యాన్స్ ని కూల్ చేశారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా రిలీజ్ కి ఓ రోజు ముందు అందరికీ ట్విస్ట్ ఇచ్చాడు.
ఈ సినిమా ఉగ్రం కి రీమేక్ లాంటిది అని చెప్పాడు. ఈ పాయింట్ కోసం తాను ఏమన్నాడంటే తన మొదటి సినిమా ఉగ్రం ని అప్పట్లో అనుకున్న విధంగా చెప్పాల్సిన రేంజ్ లో చెప్పలేకపోయాను అని ఆ సినిమాకి నాలో చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే దానిలో కోర్ పాయింట్ మాత్రమే తీసుకుని ప్రభాస్ ఇమేజ్ కి తగ్గ మార్పులు చేసి చేసానని చెప్పాడు.
దానిని రీమేక్ గా తాను భావించడం లేదని చెప్పడం కొసమెరుపు. దీనితో ఈ ఊహించని అంశం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. ఈ లాస్ట్ మినిట్ లో అయితే ఈ సినిమాపై ఏమీ అంత ప్రభావం చూపించదని చెప్పొచ్చు. కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది.