ట్విట్టర్ రివ్యూ : అజిత్ “తెగింపు” తెలుగు ఆడియెన్స్ కి నచ్చుతుందా.?

ఈరోజు కోలీవుడ్ సినిమా దగ్గర దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత వచ్చిన మాసివ్ బాక్సాఫీస్ క్లాష్ అని చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలు థలా అజిత్ కుమార్ అలాగే దళపతి విజయ్ లు నటించిన చిత్రాలు తూనీవు అలాగే వరిసు సినిమాలు రిలీజ్ కాగా వీటిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అజిత్ తూనీవు సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

మరి తెలుగులో “తెగింపు” అనే టైటిల్ తో రిలీజ్ కాగా ఈ సినిమాకి తెలుగులో భారీ రిలీజ్ అయితే ఈరోజు దక్కింది. మరి ఈ చిత్రంని దర్శకుడు వినోద్ తెరకెక్కించగా వీరి కాంబినేషన్ నుంచి వచ్చిన లాస్ట్ చిత్రం వలిమై తెలుగులో కూడా డీసెంట్ హిట్ అయ్యింది.

దీనితో కాస్త నోటెడ్ గానే ఈ సినిమా రిలీజ్ కాగా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ట్విట్టర్ ప్రజానీకం అయితే చెప్తున్నారు. ఈ రివ్యూస్ ప్రకారం అయితే తెగింపు సినిమా తెలుగులో కూడా అజిత్ ని ఇష్టపడేవారికి అయితే నచ్చుతుంది అట. అంతే తప్ప సినిమాలో అంత చెప్పుకునేదగ్గ విషయం ఏమి లేదని అంటున్నారు.

తమిళ ఆడియెన్స్ కి నచ్చవచ్చు ఏమో కానీ మన తెలుగులో అయితే నచ్చే అవకాశం తక్కువ ఉందని అంటున్నారు. సినిమాలో యాక్షన్ పాటలు బాగున్నాయి కానీ సినిమాలో ఉన్న మెసేజ్ అయితే మనం ఆల్రెడీ చూసిన దానిలాగే ఉంటుందట. దీనితో అయితే తెగింపు సినిమాకి కాస్త తెలుగులో మిక్సిడ్ రెస్పాన్స్ తోనే స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చు. మరి ఓవరాల్ గా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎక్కడ నిలబెడతారో చూడాలి.