ప్రముఖ సీరియల్ నటి, యాంకర్ చిత్ర ఆత్మహత్య

chitra

ప్రముఖ టెలివిజన్ సీరియల్ నటి, హోస్ట్ చిత్ర ఆత్మహత్య చేసుకుంది. డిసెంబర్ 9, బుధవారం చెన్నైలోని నజ్రత్‌పేట్‌లోని ఒక హోటల్ గదిలో ఆమె శవమై కనిపించారు. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు షాక్ కు గురయ్యారు. తమిళ్ లో పాండియన్ స్టోరీస్‌లో ముల్లా కతిరావన్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న చిత్రకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది. ఆమె ఫొటోలు కూడా సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

యాంకర్ చిత్ర ఆత్మహత్య

కేవలం నటిగానే కాకుండా యాంకర్ గా కూడా మంచి క్రేజ్ అందుకున్న చిత్ర అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం తమిళ చిత్ర పరిశ్రమను సందిగ్ధంలో పడేసింది. ఇక ఆమెకు గత కొన్ని నెలల క్రితమే నిశ్చితార్థం కూడా అయ్యింది. ఇప్పుడు చిత్ర కాబోయే భర్తతోనే ఉంటోంది. ఇక అర్ధరాత్రి 2గంటల తరువాత హోటల్ కు చేరుకున్న చిత్ర అప్సెట్ తోనే వచ్చినట్లు హోటల్ సిబ్బంది ద్వారా తెలిసింది. అయితే రూమ్ కు వెళ్లిన ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు ఉదయమే అందరికి తెలిసింది.

తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ మరణ వార్త అందరిని షాక్ కు గురి చేసింది. సాఫీగా కొనసాగుతున్న కెరీర్ పట్ల నిత్యం నవ్వుతూ సంతోషంగా ఉండే చిత్ర సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం తోటి నటీనటులకు సందిగ్ధంలో పడేసింది. ఈ మరణం వెనుక పలు అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ అసలు కారణం ఏమిటనేది అంతుచిక్కడం లేదు. ఇక ఆమె అభిమానులను కూడా ఈ మరణవార్త తీవ్ర మనోవేదనకు కలిగిస్తోంది. సోషల్ మీడియా ద్వారా నటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ వారి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.