మహేష్ కి ఇంకా ఈ పిచ్చి పోలేదా? తన తప్పేముంది?

టాలీవుడ్ సినిమా దగ్గర నంబర్స్ గేమ్ ఎప్పుడూ కూడా సస్పెన్స్ గానే ఉంటుంది.  సినిమా రికార్డులు వసూళ్లు నంబర్స్ కోసమే అనేది. అయితే ఈ రికార్డ్స్ కలెక్షన్స్ కోసం కొందరు హీరోలు పెద్దగా పట్టించుకోరు కానీ మరికొందరు అయితే ఇంకా తమ చిత్రాలకి డే 1 నుంచే వసూళ్లు అనౌన్స్ చేసుకుంటూ ఉంటారు.

అయితే అలాంటి హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఉంటాడని చెప్పాలి. కాగా మహేష్ బాబు హీరోగా నటించిన ఆల్ మోస్ట్ అన్ని సినిమాలకి కూడా థియేట్రికల్ రన్ కానీ వసూళ్లు రికార్డ్స్ కూడా కానీ ఇప్పటికీ భారీ లెక్కలతో పోస్టర్స్ వస్తూ ఉంటాయి. అయితే తన లాస్ట్ చిత్రం సర్కారు వారి పాట కి కూడా వేసుకున్నాడు.

అయితే తన సినిమా తన ఇష్టం ఇది పక్కన పెడితే రీసెంట్ గా మాత్రం టాలీవుడ్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ స్టార్ట్ చేసిన రీ రిలీజ్ ట్రెండ్ కోసం అందరికీ తెలిసిందే. గత ఏడాది మహేష్ బాబు బర్త్ డే కానుకగా ప్లాన్ చేసిన చిత్రం పోకిరి రీ రిలీజ్ భారీ రికార్డ్స్ సెట్ చేయగా ఈ చిత్రం తర్వాత ఈ ఏడాది బర్త్ డే కి మహేష్ ఫ్యాన్స్ మాస్ హిట్ చిత్రం బిజినెస్ మెన్ సినిమాని ప్లాన్ చేసుకున్నారు.

అయితే రీ రిలీజ్ విషయంలో మహేష్ బాబు లాస్ట్ ఇయర్ కూడా పోకిరి చిత్రానికి ఎలాంటి పోస్ట్ వేసుకోలేదు కానీ మొదటి సారి అయితే బిజినెస్ మెన్ ట్రైలర్ పోస్ట్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోడం తప్పైపోయింది. దీనితో మహేష్ కి మాత్రం ఇంకా రికార్డ్స్ పిచ్చి పోలేదు అని సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేస్తున్నారు.

తన సినిమా తన ఇష్టం ఫ్యాన్స్ రిలీజ్ చేసుకుంటున్న సినిమా ట్రైలర్ కోసం కూడా పోస్ట్ చేసుకుంటే అందులో తప్పేముందో కూడా అర్ధం కావట్లేదు. అలాంటిది మహేష్ బాబుపై ఇలా ట్రోల్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆగస్ట్ 9న బిజినెస్ మెన్ రీ రిలీజ్ అవుతుండగా దీనికి అదిరే బుకింగ్స్ అయితే ఇపుడు నమోదు అవుతున్నాయి.