త్రివిక్రమ్ లైనప్ కూడా మామూలుగా లేదండోయ్.!

Trivikram-1200x800

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ దర్శకులు ప్రతీ ఒక్కరికీ కూడా తమ మార్క్ ఉంది. అలా ఇప్పుడు ఒకో స్టార్ దర్శకుడు తమ సినిమాలతో బిజీగా ఉన్నారు, కానీ వీరి అందరికీ మించి అయితే భారీ లైనప్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

భారీ హిట్ అల వైకుంఠపురములో చిత్రం తర్వాత తాను ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రం చేస్తున్నాడు. మరి ఈ సినిమా తర్వాత కూడా త్రివిక్రమ్ అదిరే లైనప్ తో ఉన్నాడట. కాగా ఈ లిస్ట్ లో వెంటనే మళ్ళీ బన్నీ తో భారీ చిత్రం ఉండగా దీనిని త్రివిక్రమ్ కెరీర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా అయితే ప్లాన్ చేస్తున్నారట.

ఇంకా దీనితో పాటుగా ఎన్టీఆర్ తో చేయాల్సి ఉన్న భారీ చిత్రం కూడా ఇంకా ఆన్ లో ఉందట. పైగా దీనితో పాటుగా లేటెస్ట్ గా అయితే పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కూడా త్రివిక్రమ్ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఒకే చేయించుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

దీనితో హీరోలతో పాటుగా టాలీవుడ్ ఇతర దర్శకుల్లో కన్నా త్రివిక్రమ్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకో సినిమాతో అయితే యమా బిజీగా ఉండనున్నాడు. కాగా ఫ్యూచర్ లో పవన్ తో కూడా సినిమా ఉండొచ్చని బజ్ ఉంది. మొత్తానికి అయితే సౌత్ లో మాత్రం భారీ లైనప్ ఉన్న దర్శకుల్లో అతి తక్కువ మందిలో అయితే ఇపుడు త్రివిక్రమ్ నిలిచాడు.