Trisha: హీరోయిన్ త్రిష గురించి మనందరికీ తెలిసిందే. ఈమె సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది త్రిష. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ అన్ని భాషల్లో టించి మెప్పించింది. స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి అవుతున్న కూడా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే మామూలుగా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గడం అన్నది సహజం.
కానీ హీరోయిన్ త్రిష విషయంలో ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆమె వయసు పెరిగే కొద్దీ వయసుతో పాటు అందరం మరింత పెరుగుతోంది. ప్రస్తుతం ఆమె వయసు 41 సంవత్సరాలు. ఇప్పటికీ ఏ మాత్రం తరగని అందం చేతినిండా సినిమాలతో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది. ఇకపోతే ఈ ఏడాది వరుసగా హ్యాట్రిక్ హిట్టు కొట్టిన త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. అలాగే తెలుగు, తమిళంలో మరిన్ని చిత్రాల్లో కనిపించనుంది. ఇదిలా ఉంటే గతంలో త్రిషకు సంబంధించిన ఒక పాత ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అందులో విజయ్ దళపతి ఫోటోను చూపిస్తూ పలు ప్రశ్నలు అడిగారు యాంకర్. దీంతో విజయ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ.. విజయ్ చాలా డిఫరెంట్.. షూటింగ్ సమయంలో అతడు చాలా నిశ్శబ్దంగా ఉంటాడు. అందుకే అతడిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. కానీ సినిమా కోసం ఎంతో కష్టపడుతుంటారు. అతడు ఎల్లప్పుడూ నాకు సరికొత్తగా కనిపిస్తుంటారు అని చెప్పుకొచ్చింది.