త్రిష.. పెళ్లయిన హీరోకు తల్లిగానా?

గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను అందుకున్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లలో త్రిష ఒకరు. ఎంతోమంది హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపును సాధించారు. ఇక ఎక్కువ కాలం అదే స్టార్ హోదాను అనుభవించిన వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది. ఇక త్రిష కూడా విధంగా చూసుకుంటే టాప్ లిస్టులో ఉంటుంది అని చెప్పవచ్చు.

ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఈ బ్యూటీ తనకు రావాల్సిన క్రేజ్ అయితే అలానే అందుకుంటుంది. ఇక ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఆఫర్లను వరుసగా అందుకునే ప్రయత్నం చేస్తుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న సినిమాలో త్రిష మెగాస్టార్ కు జోడిగా కనిపించబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మరొక ముఖ్యమైన పాత్ర కోసం శర్వానంద్ కనిపించబోతున్నాడు. ఇక అతనికి తల్లిదండ్రులుగా మెగాస్టార్ చిరంజీవి త్రిష కనిపించబోతున్నారు. మెగాస్టార్ కి కొడుకుగా అంటే ఓకే కానీ త్రిషకు తల్లిగా అంటేనే సెట్ అవుతుందా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే శర్వానంద్ కు పెళ్లి అయింది. అతను వయస్సు 39. ఇక త్రిష వయసు కూడా దాదాపు అదే.

ఇక ఆమె శర్వానంద్ కు తల్లిగా ఎ తరహాలో నటిస్తుంది అసలు ఆడియన్స్ ఈ తరహా కాంబినేషన్ ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది విడుదల తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో దర్శకుడు చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం.