ట్రైలర్ టాక్ : ఏలియన్ బ్యాక్ డ్రాప్ లో “అయలాన్” పై అంచనా వచ్చేసినట్టే

ఒక వినూత్న సినిమాలు చేయడంలో ఎప్పుడు ముందు ఉండే సినీ పరిశ్రమలో తమిళ సినిమా కూడా ఒకటి. మరి తమిళ్ సినిమా నుంచి ఇప్పుడు వరకు ఎన్నో భారీ చిత్రం మెయిన్ గా సైన్స్ ఫిక్షన్ జానర్ లో చిత్రాలు చాలానే చేస్తారు. అలా చాలా కాలం తర్వాత తమిళ్ సినిమా నుంచి వస్తున్నా ఏలియన్ బ్యాక్ డ్రాప్ సినిమానే “అయలాన్”.

తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవుతున్న హీరో శివ కార్తికేయన్ హీరోగా దర్శకుడు ఆర్ రవికుమార్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పై ఒక అంచనా తెలియాలి అంటే ట్రైలర్ వరకు ఆగాల్సి వచ్చింది. కాగా తెలుగు మరియు తమిళ భాషల్లో వచ్చిన ఈ ట్రైలర్ అంచనాలకి తగ్గ రేంజ్ లో లేదని చెప్పక తప్పదు.

కొంచెం కామెడీ బాగుంది కానీ ఏలియన్ బ్యాక్ డ్రాప్ పెట్టి ఏదో క్రింజ్ చేసేలా అనిపిస్తున్నారు. ఇంకా సినిమాలో పలు విజువల్స్ ని గ్రాండ్ గా చూపించే ప్లాన్ చేశారు కానీ అందులో గ్రాఫిక్స్ ఇంకా నాచురల్ గా ఉండాల్సింది. దీనితో వీటి విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యారు.

అలానే ఏలియన్ మాత్రం కొంచెం నాచురల్ గా పర్వాలేదు అనిపిస్తుంది దానిపై సీన్స్ సూపర్ పవర్స్ ఉన్నట్టుగా ఏక్షన్ సీన్ లు వంటివి పిల్లలకు నచ్చేలా అనిపిస్తున్నాయి. కానీ ఓవరాల్ గా మాత్రం అయలాన్ ట్రైలర్ అంచనాలు రీచ్ అయ్యే లెవెల్లో లేదనే అనిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి రెహమాన్ ఇచ్చిన సంగీతం అయితే కేజ్రీగా ఉంది. మరి వచ్చే 12న వస్తున్నా ఈ సినిమా మొత్తం ఎలా ఉంటుందో చూడాలి మరి. 
Ayalaan (Telugu) - Official Trailer | Sivakarthikeyan, Rakul Preet Singh | A.R. Rahman | R.Ravikumar