ట్రైలర్ టాక్ : గూజ్ బంప్స్ తెప్పించేలా ఈసారి “హిట్” సినిమా.!

ఇప్పుడు టాలీవుడ్ ఎంతలా పరిణితి చెంది ఏ రేంజ్ సినిమాలు డెలివర్ చేస్తుందో చూస్తున్నాము. మరి ఇప్పుడు టాప్ దర్శకులతో పాటుగా యువ దర్శకులు కూడా ఎంతగానో సత్తా చాటుతూ ఉండగా వారిలో మరో యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రం “హిట్”.

అయితే మొదటి సినిమా విశ్వక్ సేన్ తో స్టార్ట్ చెయ్యగా ఓ ఫ్రాంచైజ్ లా ఈ సినిమాలని అనౌన్స్ చేశారు. ఇక రెండో సినిమాని అయితే అడివి శేష్ హీరోగా చేస్తుండగా దీని నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ నే అదిరింది అంటే ఇక ఇప్పుడు వచ్చిన ట్రైలర్ అంతకు మించి ఉందని చెప్పాలి.

గత టీజర్ లో కట్స్ ఏవి కనిపించనుకుండా కొత్తగా డిజైన్ చేసిన ఈ ట్రైలర్ గూజ్ బంప్స్ తెప్పించే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఓ అమ్మాయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ లో కనిపించే సీన్స్ రసవత్తరంగా ఉండగా నెక్స్ట్ అయితే ట్రైలర్ లాస్ట్ లో చూపించిన ట్విస్ట్ మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి.

కాస్త చెప్పుకోడానికి ఇబ్బందికరంగా ఉన్నా కూడా కొందరి అమ్మాయిల బాడీ పార్ట్ లు కలిపి ఒక బాడీ గా చేయడం పైగా ఆ అమ్మాయిలకి రేప్ చెయ్యకుండా వారి మెడ పై గాటు పంటి పెట్టడం దాని ద్వారా శేష్ ఆ హంతకుణ్ణి పట్టుకుంటాడా లేదా అనే అంశాలు ఈ ట్రైలర్ లో అదిరిపోయాయి.

దీనితో హిట్ 2 కూడా పెద్ద హిట్ అయ్యేలానే అనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ట్రైలర్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరి కి పెద్ద ఇంపార్టెన్స్ కనిపించలేదు. కానీ తనికెళ్ళ భరణి, నటుడు రావు రమేష్ లు మంచి పాత్రలు చేసినట్టు అనిపిస్తుంది.

అలాగే హీరోకి విలన్ కి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా అనిపిస్తుంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ డిసెంబర్ 2 వరకు ఆగాల్సిందే. 
HIT 2 Trailer | Adivi Sesh | Nani | Sailesh Kolanu | Wall Poster Cinema