“హిట్ 2” చూసాక సీరియస్ వార్నింగ్ ఇచ్చిన అమ్మాయికి అడివి శేష్ రిప్లై.!

ఈ వారం టాలీవుడ్ సినిమా దగ్గర రెండు సినిమాలు అయితే రిలీజ్ కాగా వాటిలో మన తెలుగు చిత్రం “హిట్ 2” మాత్రం వార్ వన్ సైడ్ చేసేసింది అని చెప్పాలి. మొదట రోజే క్రేజీ వసూళ్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ఓ సెక్షన్ ఆడియెన్స్ నుంచి ఊహించని స్పందనని అయితే అందుకుంటుంది.

ఈ చిత్రంలో కింతమంది  డిస్టర్బ్ చేసే విధంగా సన్నివేశాలు చూపించడం ఓ సైకో ఆ ఆడవాళ్ళని టార్గెట్ చెయ్యడం వంటివి కొంతమందికి నచ్చలేనట్టు ఉంది. దీనితో నిన్న షో చూసిన వెంటనే ఓ యువతి అయితే హిట్ 3 లో అమ్మాయి ని సైకో గా చూపించండి ఆ అమ్మాయి అబ్బాయి లను చంపినట్టుగా చూపించండి లేదా..

నేనే చంపుతా అంటూ ఓ రేంజ్ లో మాస్ వార్నింగ్ చిత్ర యూనిట్ కి ఇవ్వగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారిపోయింది. అయితే  అడివి శేష్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ రిప్లై ఇవ్వడం ఇప్పుడు వైరల్ గా మారింది.

తాను రిప్లై ఇస్తూ గట్టిగా నవ్వుతూ “చంపినా చంపేస్తుంది కాకపోతే థియేటర్స్ లో” అంటూ ఆమెకి సెటైర్ వేసాడు. దీనితో ఈ రిప్లై వైరల్ కాగా సినిమాని సినిమాలా చూడాలి అంటూ నెటిజన్స్ ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.