బాక్సాఫీస్ : యూఎస్ లో రేర్ రికార్డు తో “హిట్ 2” చిత్రం.!

ఈ ఏడాది టాలీవుడ్ లో స్యూర్ షాట్ హిట్ గా వచ్చిన చిత్రాల్లో ఈ డిసెంబర్ లో వచ్చిన చిత్రం “హిట్ 2” కూడా ఒకటి. యంగ్ హీరో అడివి శేష్ నటించిన ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కించగా ఇది తమ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచి మంచి వసూళ్లు సాధించి నిలిచాయి.

ఇక ఈ చిత్రం అయితే రిలీజ్ కి ముందే మంచి అగ్రెసివ్ ప్రమోషన్స్ ని జరుపుకోగా నెక్స్ట్ అయితే యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం సాలిడ్ ప్రీమియర్స్ కూడా కొల్లగొట్టగా ఈ చిత్రం ఇప్పుడు అక్కడ ఓ రేర్ రికార్డుని అయితే సెట్ చేసి పెట్టింది. మరి ఈ చిత్రం లేటెస్ట్ గా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని అయితే అందుకుంది.

మరి యూఎస్ లో హిట్ అయిన అన్ని చిత్రాలు రెగ్యులర్ గా టచ్ చేసే మార్క్ కదా ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటే ఇక్కడ ఈ చిత్రానికి డెఫినెట్ గా ఉంది. ఈ సినిమాకి సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఇందులో ఉండే వైలెన్స్ తో అయితే అడల్ట్స్ మాత్రమే ఈ సినిమా చూడాలి అని సర్టిఫికెట్ ని అందించారు.

మరి ఇలా పక్కా A సర్టిఫికెట్ తో యూఎస్ లో 1 మిలియన్ డాలర్స్ అందుకున్న చిత్రాల్లో హిట్ 2 ఇప్పుడు రెండో సినిమాగా నిలవడానికి అతి చేరువలో ఉంది. ఇన్నాళ్ల తెలుగు సినిమాలో అయితే యూఎస్ లో ఈ ఫీట్ అందుకున్న మొదటి సినిమాగా సెన్సేషనల్ హిట్ చిత్రం “అర్జున్ రెడ్డి” నిలవగా ఇప్పుడు దీని తర్వాత 1 మిలియన్ డాలర్స్ తో “హిట్ 2” మాత్రమే నిలిచి అరుదైన రికార్డు అందుకుంటుంది.